Buchiahpeta: రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి
Buchiahpeta: బుచ్చయ్యపేట మండలంలో ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను రైతులందరూ త్వరగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారుల సూచన. బీమా వర్తింపు వివరాలు.
Buchiahpeta: రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి
బుచ్చయ్య పేట: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని బుచ్చయ్య పేట మండలం లో ఇప్పటివరకు గాను మండలంలో 2415 హెక్టార్లకు గాను 747 హెక్టార్లు వరి నాట్లు వేయడం జరిగింది అదేవిధంగా 2485 హెక్టార్లకు గాను రైతులు పంటల భీమా నమోదు చేసుకోవడం జరిగింది . దీనికి గాను వరి వేసిన ప్రతి ఒక్కరు కూడా మీ సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రం అధికారి ద్వారా ఈ పంట నమోదు చేసుకున్నట్లయితే భీమా వర్తిస్తుంది.
ప్రస్తుతం కురుస్తున్న వానల కారణంగా అదేవిధంగా ప్రకృతి వైపృత్యాలు వల్ల పంటలకి ఎటువంటి నష్టం వాటిల్లిన మరియు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వానికి ఇవ్వాలన్న అన్నియు కూడా ఈ పంట నమోదు ద్వారానే జరుగుతాయి.
కావున ప్రతి ఒక్క రైతు కూడా నమోదు చేసుకోవలెను మరియు రైతు తన చరవాణి ద్వారా( మొబైల్ ఫోన్ ) సొంతంగా తమ యొక్క పొలంలో ఏ పంట వేశారో రైతే నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ కల్పించింది ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క నమోదు ప్రక్రియను ఈ వారం రోజులు లోపు పూర్తి చేసుకుంటారని రైతులందరికీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం అధికారిని రేణుక అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.




