Chodavaram: బుచ్చంపేటలో ప్రశాంతంగా ఎస్ఎమ్‌సీ ఎన్నికలు.. నూతన కమిటీల ఎన్నిక
Chodavaram: రోలుగుంట మండలం బుచ్చంపేట జెడ్పీ హైస్కూల్, ఎంపీపీ స్కూళ్లలో ఎస్ఎమ్‌సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నూతన కమిటీ సభ్యులను అనిమిరెడ్డి రమణ సత్కరించారు.
Chodavaram: బుచ్చంపేటలో ప్రశాంతంగా ఎస్ఎమ్‌సీ ఎన్నికలు.. నూతన కమిటీల ఎన్నిక
అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గ పరిధిలోని రోలుగుంట మండలం బుచ్చంపేట జెడ్పీ హై స్కూల్ మరియు ఎంపీపీ స్కూల్ Smc ఎన్నిక గ్రామంలో పెద్దలు, యువకులు బుచ్చంపేట ఐక్యత చాటి చెప్పే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ నిబంధనలు కు అనుగుణంగా స్కూల్ యాజమాన్యం చక్కగా ఎన్నిక నిర్వహించటం జరిగింది.
ఈ ఎన్నికలో జెడ్పీ హై స్కూల్ చైర్మన్ గా శ్రీ రెడ్డి భాస్కర రావు గారు, వైస్ చైర్మన్ గా శ్రీ మతి ఉలబాల నాగ సత్యవతి గారు అదే విధంగా ఎంపీపీ స్కూల్ చైర్మన్ శ్రీ షేక్ నాని గారు మరియు వైస్ చైర్మన్ అనిమిరెడ్డి శ్రీమతి రామ లక్ష్మీ గారు మరియు బోర్డ్ మెంబెర్స్ ఎన్నిక కావటం జరిగింది.
దీనిలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ, స్కూల్ , విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, చిరు జ్ఞాపికను అందజేసి చిరు సత్కారం చేయటం జరిగింది.




