Narsipatnam: స్థానిక కేడర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపైనే అసంతృప్తి!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బీజేపీలో విభేదాలు స్థానిక కేడర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్య డాక్టర్ రాజీనామా

R. A. Naidu, Narsipatnam
Published on: 29 Sept 2026 12:51 PM IST
Narsipatnam
X

Narsipatnam: స్థానిక కేడర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపైనే అసంతృప్తి!

Narsipatnam: నర్సీపట్నం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన కీలక సమయంలో, స్థానిక పార్టీ కేడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కొందరు వ్యవహరిస్తున్న తీరు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

గతంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారనే అభిప్రాయంతో, సంబంధిత కొందరు వ్యక్తులను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచి, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతలు కూడా అప్పగించకుండా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించడం పార్టీ శ్రేణుల్లో సహజంగానే అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైన సమయంలో, గతంలో పార్టీకి నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని భావించి దూరంగా ఉంచిన వ్యక్తులకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీకి, కూటమికి ప్రయోజనం కలుగుతుందా? లేక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల్లో అయోమయం, అసంతృప్తి పెరుగుతుందా? అనే విషయాన్ని పార్టీ నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అదేవిధంగా, నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధం లేని ఇతర జిల్లాకు ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తి, స్థానిక పార్టీ కేడర్‌ను సంప్రదించకుండా నర్సీపట్నం నియోజకవర్గంలోని కీలక అంశాల్లో జోక్యం చేసుకోవడం, స్థానిక విషయాలపై ప్రెస్‌మీట్లు నిర్వహించడం వంటి పరిణామాలు పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి.

స్థానికంగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులు, పదాధికారులు, కార్యకర్తలను విశ్వాసంలోకి తీసుకోకుండా, ఇతర జిల్లాకు ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తికి స్థానిక వ్యవహారాల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

అదేవిధంగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి సమన్వయ సమావేశాల్లో స్థానిక పార్టీ కేడర్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా బాధాకరంగా ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.*

పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా పార్టీ కోసం పనిచేసే స్థానిక కార్యకర్తకు గౌరవం, గుర్తింపు, బాధ్యత ఉండాలి. స్థానిక కేడర్‌ను పక్కనపెట్టి తీసుకునే నిర్ణయాలు పార్టీకి బలం చేకూర్చడం కంటే అసంతృప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది.

*అదేవిధంగా, నర్సీపట్నం పట్టణంలోనే జిల్లా ఓబీసీ అధ్యక్షుడు అందుబాటులో ఉన్నప్పటికీ, వారికి సమాచారం ఇవ్వకుండా ఇతర జిల్లాకు ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తికి సమావేశాల్లో ప్రాధాన్యం కల్పించడం పట్ల పార్టీ కార్యకర్తలు మరియు కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కూటమి పార్టీల మధ్య సమన్వయం అత్యంత అవసరమైన ఈ సమయంలో, స్థానిక నాయకత్వాన్ని పక్కనపెట్టడం వల్ల కూటమి శ్రేణుల్లో కూడా అనవసరమైన అపోహలు ఏర్పడే అవకాశం ఉంది.

కూటమి బలం నాయకుల మధ్య సమన్వయంతో పాటు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల ఐక్యతపై ఆధారపడి ఉంటుంది . ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై విశ్వాసంతో, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలోకి రావాలనుకునే అనేకమంది ఉన్నారు. అయితే స్థానికంగా జరుగుతున్న పరిణామాలు వారికి అయోమయాన్ని కలిగించే పరిస్థితి రావడం పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు.

*వ్యక్తులు ముఖ్యం కాదు — పార్టీ ముఖ్యం.

పదవులు ముఖ్యం కాదు — పార్టీ సిద్ధాంతం ముఖ్యం.

వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు — కార్యకర్తల గౌరవం, పార్టీ విజయం ముఖ్యం.*

అందువల్ల నర్సీపట్నం నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, పదాధికారుల మనోభావాలను పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ, రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకుని, స్థానిక కేడర్‌కు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నాను.

స్థానిక పార్టీ వ్యవహారాల్లో అనవసర జోక్యాలను నివారించి, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న స్థానిక నాయకులు, పదాధికారులు, కార్యకర్తలను విశ్వాసంలోకి తీసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

జిల్లా ఓబీసీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, పార్టీ సిద్ధాంతాల పట్ల, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల నాకు ఉన్న పూర్తి విశ్వాసంతోనే, జిల్లా ఓబీసీ అధ్యక్షుడిగా నాకు అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.*

ఈ నిర్ణయం వ్యక్తిగత అసంతృప్తితో తీసుకున్నది కాదు. పార్టీ కోసం పనిచేస్తున్న స్థానిక కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి, పార్టీ వ్యవస్థలో సమన్వయం ఉండాలి, క్షేత్రస్థాయి నాయకత్వానికి తగిన గుర్తింపు లభించాలి అనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువస్తున్నాను.

నర్సీపట్నంలో బీజేపీ మరింత బలపడాలంటే స్థానిక కేడర్‌ను గౌరవించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

ఈ అంశంపై పార్టీ జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వం తక్షణమే స్పందించి, పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళనకు పరిష్కారం చూపాలని వినతిపూర్వకంగా కోరుతున్నాను .

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam