Kunavaram: కూనవరం మండలంలో కూటమి అభ్యర్థుల గెలుపునకు బీజేపీ ప్రచారం!

Kunavaram: కూనవరం మండలంలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బిజెపి ఇన్‌చార్జ్ డివిఎస్ రమణారెడ్డి పిలుపు. పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 25 Oct 2026 5:56 PM IST
Kunavaram
X

Kunavaram: కూనవరం మండలంలో కూటమి అభ్యర్థుల గెలుపునకు బీజేపీ ప్రచారం!

కూనవరం: కూనవరం మండలంలో జరిగే స్థానిక సమరంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కూనవరం బిజెపి ఇన్చార్జ్ డివిఎస్ రమణారెడ్డి(చిట్టిబాబు)పిలుపునిచ్చారు.

కూనవరం మండలం పెద్దార్కుర్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కరక పవన్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 5 ఎంపీటీసీ స్థానాలు, జనసేనకు కేటాయించిన 2 ఎంపీటీసీ స్థానాలు,బిజెపి కి కేటాయించిన జడ్పిటిసి మరియు ఎంపీటీసీ స్థానాన్ని గెలిపించేందుకు కూటమి పార్టీలతో కలిసి బిజెపి కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేసి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 41 వ కాంటూర్ పరిధి అందరికీ ప్యాకేజీ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందని,45వ కాంటూర్ ని పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసే విధంగా బిజెపి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రమణారెడ్డి అన్నారు.కూనవరం మండల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని రోడ్లు, రైల్వే లైన్లు నీటిపారుదుల రంగాలను, విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ప్రజలకు వివరించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డివిఎస్ రమణారెడ్డి సూచించారు.

స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి నోముల సత్యనారాయణ ను పరిచయం చేశారు.రాబోయే కాలంలో పోలవరం నిర్వాసితుల మూడవ లిస్టు ప్రకటించడం జరుగుతుందని మిగతా 45 గ్రామాలకు బిజెపి కూటమి గెలిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని కూనవరం జడ్పిటిసి అభ్యర్థి పాయం వెంకయ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కుంజా చంద్రయ్య, మహిళా మండల అధ్యక్షురాలు సోయం. సుధారాణి,గిరిజన సంఘం సీనియర్ నాయకులు తుర్రం.అశోక్ కుమార్, పాయం వెంకన్న బాబు చిచ్చడి నారాయణ, చిచ్చటి ప్రసాద్,మడకం కన్నయ్య,బి.వీ.ఎస్ నారాయణ,పూనెం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR