Visakhapatnam: విశాఖలో ఘనంగా బీఐఎస్ స్టాండర్డ్స్ కాన్క్లేవ్ నిర్వహణ!
Visakhapatnam: విశాఖపట్నంలో బీఐఎస్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవ ముందస్తు స్టాండర్డ్స్ కాన్క్లేవ్ ఘనంగా నిర్వహించారు.
Visakhapatnam: విశాఖలో ఘనంగా బీఐఎస్ స్టాండర్డ్స్ కాన్క్లేవ్ నిర్వహణ!
Visakhapatnam: ప్రపంచ ప్రమాణాల దినోత్సవ వేడుకలకు ముందస్తుగా భారతీయ ప్రమాణాల సంస్థ (బిఐఎస్), విజయవాడ శాఖ ఆధ్వర్యంలో సోమవారం విశాఖపట్నంలోని ఫోర్ పాయింట్స్ బై షెరటాన్ హోటల్ లో స్టాండర్డ్స్ కాన్క్లేవ్ ను ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 14న విజయవాడలో జరగనున్న మానక్ మహోత్సవ్ / ప్రపంచ ప్రమాణాల దినోత్సవ వేడుకలకు ముందస్తు కార్యక్రమంగా దీన్ని నిర్వహించారు.
ఈ సదస్సులో పరిశ్రమల ప్రతినిధులు, తయారీ దారులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహా 90 మందికి పైగా పాల్గొన్నారు. బిఐఎస్ విజయవాడ డైరెక్టర్ అండ్ హెడ్ ప్రేమ్ సజని పట్నాల ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం సైంటిస్ట్ డి / జాయింట్ డైరెక్టర్ షణ్ముఖ శివ పల్లి ప్రపంచ ప్రమాణాల దినోత్సవ సందేశాన్ని చదివి వినిపించారు. ఈ ఏడాది థీమ్ - ఎస్డిజి 7 అయిన సరసమైన మరియు స్వచ్ఛమైన ఇంధనం అనే అంశంపై ప్రముఖులు ప్రసంగించారు.
ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డా.శ్రీదేవి వేలూరు, ఎన్ఎస్జి గ్రూప్ గ్లోబల్ ప్రతినిధి వెంకట కిరణ్ జి ప్రసంగిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రమాణాల పాత్రను వివరించారు. స్కూల్స్ ఆఫ్ స్టాండర్డ్స్ క్లబ్స్ విద్యార్థులు పోస్టర్లు, చార్టుల ప్రదర్శన ఏర్పాటు చేసి నిత్య జీవితంలో ప్రమాణాల ప్రాముఖ్యతను చాటారు. ప్రజల్లో అవగాహన కోసం విశాఖలో 32 రద్దీ ప్రాంతాల్లో, 5 ప్రధాన కూడళ్లలో బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఉత్తమ పనితీరు కనబరిచిన పరిశ్రమలను సత్కరించారు. అనంతరం బిఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ డి.వివేక్ వర్ధన్ రెడ్డి అందరితో నాణ్యతా ప్రతిజ్ఞ చేయించారు.




