Bheemili: మత్స్యకార గ్రామాల్లో అర్నబ్ తుఫాను పోలీస్ అలర్ట్!
Bheemili: భీమిలిపట్నం సీఐ దివాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మత్స్యకార గ్రామాల్లో అర్నబ్ తుఫానుపై అవగాహన. సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, ఇళ్లలోనే ఉండాలని సూచన.
Bheemili: మత్స్యకార గ్రామాల్లో అర్నబ్ తుఫాను పోలీస్ అలర్ట్!
భీమిలి: 2026 అక్టోబర్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు భీమిలిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్స్యకార గ్రామాలను సందర్శించి ప్రజలకు తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా భీమిలిపట్నం పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ దివాకర్ యాదవ్ గారు ప్రజలకు పలు సూచనలు చేశారు. తుఫాను సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సాధ్యమైనంత వరకు సురక్షితమైన ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని, బీచ్‌లు, సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
తుఫాను సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* బలమైన గాలులు, భారీ వర్షాలు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి.
* గాలుల తీవ్రతకు రేకులు, చెట్ల కొమ్మలు, ఇతర వస్తువులు ఎగిరివచ్చే ప్రమాదం ఉన్నందున ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
* సముద్ర తీర ప్రాంతాలు, బీచ్‌లు, వాగులు, కాలువలు మరియు నీరు ప్రవహించే ప్రాంతాలకు వెళ్లకూడదు.
* మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సంబంధిత అధికారుల సూచనలను పాటించాలి.
* అత్యవసర అవసరాల కోసం తాగునీరు, ఆహార పదార్థాలు, టార్చ్‌లైట్, మందులు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి.
* ఇళ్ల పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న వస్తువులు, వదులుగా ఉన్న రేకులు, ఇతర సామగ్రి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
* విద్యుత్ తీగలు తెగిపడినట్లు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
* వాతావరణ శాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర ప్ర�




