Bheemunipatnam: భీమునిపట్నంలో ఘనంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవం!
Bheemunipatnam: భీమునిపట్నం ఎస్ వి ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం. పాల్గొన్న ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.స్వాతి భవాని.
Bheemunipatnam: భీమునిపట్నంలో ఘనంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవం!
Bheemunipatnam: స్థానిక ఎస్ వి ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మండల సర్వీసెస్ అథారిటీ, భీమునిపట్నం ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీమతి పి.స్వాతి భవాని ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భీమునిపట్నం వారు మాట్లాడుతూ 1987 నాటి లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం నవంబర్ 9,1995 నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవలు దినోత్సవం గా జరుపుకుంటామని ఆమె తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 A పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని పేర్కొందని తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలని హక్కులతో పాటు బాధ్యతలను మరవకూడదని,న్యాయ సహాయం కోసం రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ పనిచేస్తున్నాయని తెలిపారు.
అనంతరం శ్రీమతి కే మంజులా లీగల్ ఎయిడ్ కౌన్సిలర్, డి కనకమహాలక్ష్మి లీగల్ ఎయిడ్ కౌన్సిలర్,ఎస్. వాయు నందన్ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్, పి.బాల భాస్కరరావు అడ్వకేట్ మీడియేటర్ న్యాయ సహాయంకు సంబందించినటువంటి అనేక అంశాలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సురేఖ గారు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి విద్యాసాగర్ అధ్యాపక బృందం,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.




