Visakhapatnam: భీమిలిలో సెప్టెంబర్ 21న ఉర్దూ ఘర్, షాదీ ఖానా బహిరంగ వేలం!

Visakhapatnam: విశాఖపట్నం భీమిలి జోన్‌లో నూర్ సాహెబ్ ఉర్దూ ఘర్, షాదీ ఖానాలను 3 ఏళ్లకు గుత్తకు ఇచ్చేందుకు సెప్టెంబర్ 21న బహిరంగ వేలం.

SHIVA, BHIMILI
Published on: 17 Sept 2026 6:36 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: భీమిలిలో సెప్టెంబర్ 21న ఉర్దూ ఘర్, షాదీ ఖానా బహిరంగ వేలం!

Visakhapatnam: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధి భీమినిపట్నం జోన్ 1వ వార్డు బంగ్లామెట్ట, తగరపువలస ప్రాంతాలలో నూతనంగా అభివృద్ధి చేసిన నూర్ సాహెబ్ ఉర్దూ ఘర్ మరియు షాదీ ఖానాకు ఇచ్చిన తేదీ నుండి 3 సంవత్సరములు గుత్తకు ఇచ్చుటకు తేదీ 21. 09. 2026 (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు భీమునిపట్నం జోనల్ కార్యాలయం నందు బహిరంగ వేలం నిర్వహించబడుతుందని భీమునిపట్నం జోనల్ కమిషనర్ విజయకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున వేలంపాటలో పాల్గొనే వ్యక్తులు గాని సంస్థలు గాని పూర్తి వివరాలకు భీమునిపట్నం జోనల్ కార్యాలయ పర్యవేక్షకులను కార్యాలయం పని వేళలో సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలియజేశారు.

పౌర సంబంధాలు అధికారి జివిఎంసి

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI