Bheemili: దసరా సెలవుల్లో ఇంటి భద్రతపై అప్రమత్తత: భీమిలి ఎస్సై
Bheemili: దసరా సెలవుల్లో ఊళ్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను లాకర్లలో ఉంచాలని భీమిలి ఎస్సై జే. సురేష్ సూచించారు.
Bheemili: దసరా సెలవుల్లో ఇంటి భద్రతపై అప్రమత్తత: భీమిలి ఎస్సై
భీమిలి: దసరా పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమిలి ఎస్సై జె సురెష్ విజ్ఞప్తి చేశారు. పండుగ సెలవుల్లో సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్లే సమయంలో ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ మేరకు భీమిలి సురేష్ ప్రజలకు పలు సూచనలు చేశారు.దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా వీలైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని పోలీసులు సూచించారు. ఇంటి పరిసరాల్లో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
రెండు మూడు రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే ముందుగా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అలా సమాచారం అందించిన వారికి సంబంధించి, సాధ్యమైన మేరకు ఇంటి పరిసరాల్లో పోలీసు గస్తీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలిపే ఫొటోలు, ప్రయాణ వివరాలను వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా పోస్ట్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి పోస్టుల ద్వారా ఇంట్లో ఎవరూ లేరనే విషయం నేరస్తులకు తెలిసే ప్రమాదం ఉందని, తద్వారా దొంగతనాలకు ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
దసరా పండుగను ప్రజలందరూ సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని, ఇంటి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఎస్సై జే.సురేష్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని సూచించారు.




