Bheemili: భీమిలిలో కిమ్స్ ఉచిత వైద్య శిబిరం: ఎమ్మెల్యే గంటా సందర్శన

Bheemili: భీమిలి మండల పరిషత్ ప్రాంగణంలో సీతమ్మధార కిమ్స్ ఆసుపత్రి, రోటరీ క్లబ్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు.

SHIVA, BHIMILI
Published on: 10 Oct 2026 6:25 PM IST
Bheemili
X

Bheemili: భీమిలిలో కిమ్స్ ఉచిత వైద్య శిబిరం: ఎమ్మెల్యే గంటా సందర్శన

Bheemili: భీమిలి మండల పరిషత్ ప్రాంగణంలో సీతమ్మధార కిమ్స్ ఆస్పత్రి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గంటా శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. సిబ్బంది, రోగులతో మాట్లాడి అక్కడ చేస్తున్న వైద్య పరీక్షలు.. డాక్టర్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఆర్థోపెడిక్, పల్మనాలజీ, కార్డియాలజీ, యురాలజీ, డెంటల్, ఐవీఎఫ్ కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నామని ఆస్పత్రి ప్రతినిధులు చెప్పారు. ఇదే ప్రాంగణంలో రోటరీ క్లబ్ కు చెందిన విజన్ సెంటర్ సంస్థ నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ లో రూ. 20 వేల కోట్ల భారీ కేటాయింపుల ద్వారా వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసి కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేస్తోందని చెప్పారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI