Anandapuram: ఆనందపురం జంక్షన్ విస్తరణ పనులకు ఎమ్మెల్యే గంటా భూమిపూజ!
Anandapuram: ఆనందపురం జంక్షన్ విస్తరణ పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భూమిపూజ. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ దృష్ట్యా రూ. 81 లక్షలతో రహదారి అభివృద్ధి.
Anandapuram: ఆనందపురం జంక్షన్ విస్తరణ పనులకు ఎమ్మెల్యే గంటా భూమిపూజ!
ఆనందపురం: ట్రాఫిక్ సమస్యలకు నెలవుగా మారిన ఆనందపురం జంక్షన్ అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.81 లక్షలతో జంక్షన్ విస్తరణ పనులు చేపట్టామని చెప్పారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కావడంతో ఆనందపురం జంక్షన్ పై ట్రాఫిక్ ఒత్తిడి బాగా పెరుగుతున్న నేపథ్యంలో జంక్షన్ విస్తరణ పనులు ప్రతిపాదించామని వెల్లడించారు. జంక్షన్ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దేశించిన గడువులోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టరు, అధికారులకు చెప్పారు.
కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ డిప్యూటీ మేనేజర్ గోపీకృష్ణ, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, గాడు వెంకటప్పడు, బి.ఆర్.బి. నాయుడు, మీసాల సత్యనారాయణ, మహంతి శివాజీ, లొడగల వెంకట్రావు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, బంకు రాజు, శ్రీను, బోయి రమాదేవి, గరే సదానంద, కాకర రమణ, మొల్లి లక్ష్మణరావు, మన్యాల సోంబాబు, నాగోతి సత్యనారాయణ, కానూరు అచ్యుతరావు, గరే గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.




