Bheemili: భీమిలిలో పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి: ఎమ్మెల్యే గంటా
Bheemili: భీమిలి మండలంలో 4,553 మంది రైతులకు అధికారిక రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం పంపిణీ చేశారు.
Bheemili: భీమిలిలో పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి: ఎమ్మెల్యే గంటా
భీమిలి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ భీమిలి మండలంలో ఇనాం గ్రామం నారాయణరాజు పేట మినహా పూర్తయినట్టు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో దాకమర్రి, తాటితూరు, మజ్జివలసకు చెందిన 4,553 మంది రైతులకు శనివారం పాస్ పుస్తకాలు అందజేశారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ సొమ్ము జమ కాక ఇనాం గ్రామాల రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్య తొందర్లోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రెవిన్యూ అంశాలపైనే అత్యధిక అర్జీలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను రెవిన్యూ సమస్యల్లేని రాష్ట్రంగా చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నారు.
పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపైనే కాకుండా ఆఖరికి మధ్యాహ్న భోజనంలో పిల్లలకిచ్చే కోడి గుడ్లు మీద ఫోటోలు ముద్రించుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రచారం పిచ్చి పీక్స్ కు చేరిందని విమర్శించారు. అలాంటి ప్రచార పైత్యం లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని రెండు రకాల పుస్తకాలను ప్రదర్శించారు.
కోర్టుల్లో కేసు గెలవకున్నా బీసీలకు పార్టీపరంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తేనే సమన్వయంతో అభివృద్ధికి బ్రేకు పడకుండా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో రామారావు, ఎంపీడీఓ నగేష్, డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గాడు వెంకటప్పడు, సరగడ అప్పారావు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా నూకరాజు, డి.ఎ.ఎన్. రాజు, వై. అనిల్ ప్రసాద్, పాసి నరసింగరావు, గరికిన ఎల్లాజీ, కోరాడ రమణ, గరే సదానంద, గుడ్డాల ఎల్లయ్య, కురుమిన లీలావతి, బోయి శ్రీను, నక్కా శ్రీధర్, పాసి త్రినాధ్, చెట్టుపల్లి గోపీ, మీసాల సత్యనారాయణ, గరే గురునాథ్, నాగోతి శివాజీ తదితరులు పాల్గొన్నారు.




