Bheemili: భీమిలి: తాళ్లవలస పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Bheemili: భీమిలి మండలం తాళ్లవలస జెడ్పీ హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా కూటమి బలపరిచిన బోని ఈశ్వర్ కుమార్, వైస్ చైర్మన్‌గా చుక్క లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

SHIVA, BHIMILI
Published on: 29 Sept 2026 5:22 PM IST
Bheemili
X

Bheemili: భీమిలి: తాళ్లవలస పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Bheemili: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్‌గా కూటమి నాయకులు బలపరిచిన బోని.ఈశ్వర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో తల్లిదండ్రులందరూ పాల్గొని కమిటీ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

సుమారు 250 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న ఈ పాఠశాలలో నిర్వహించిన ఎన్నికలను ఎన్నికల అధికారి రమేష్ పర్యవేక్షించారు. తల్లిదండ్రుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు . పాఠశాల అభివృద్ధికి సహకరించడంతో పాటు విద్యార్థుల ఉన్నతి, విద్యాభివృద్ధికి తోడ్పడగల వ్యక్తిని ఎస్ఎంసీ చైర్మన్‌గా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు బోని ఈశ్వర్ కుమార్ ను ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు. అదేవిధంగా కమిటీ వైస్‌ చైర్మన్‌గా చుక్క లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్‌ చైర్మన్‌ల తో పాటు సభ్యులను పాఠశాల ఉపాధ్యాయులు,స్థానిక నాయకులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధికి ఎస్ఎంసీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

మాజీ టిడిపి మండల అధ్యక్షులు డిఏఎన్ రాజు,పంచాయతీ ఉప సర్పంచ్ సింగపూర్ బుజ్జి,మాజీ ఎంపీటీసీ కోరాడ రమణ,మండల జనసేన ఉపాధ్యక్షులు ఎరుసు. సూరిరెడ్డి,టిడిపి సీనియర్ నాయకులు నడింపల్లి నారాయణమూర్తి రాజు, గొలగాని రాము,వేణు రాజు,ఎరుసు శంకర్ రెడ్డి,మామిడి భాస్కరరావు, కొయ్య రామకృష్ణ,చుక్క. లక్ష్మణ,బోని.ప్రసాద్, మట్ట ఆదినారాయణ, బోని ఆనంద్, బోని శివ, సత్తిబాబు, సామంతుల అప్పలరాజు, బోని రాంబాబు, మన్యాల జ్యోతి తదితరులు అభినందించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI