Bheemili: భీమిలి తీరంలో గుర్తుతెలియని పసికందు మృతదేహం!
Bheemili: భీమిలి బీచ్‌లో గుర్తుతెలియని మగ నవజాత శిశువు మృతదేహం లభ్యం: బొడ్డుకు క్లిప్‌తో తీరానికి కొట్టుకొచ్చిన వైనం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Bheemili: భీమిలి తీరంలో గుర్తుతెలియని పసికందు మృతదేహం!
భీమిలి: తేదీ 24-09-2026 ఉదయం సుమారు 08.00 గంటల సమయంలో భీమిలి మండలం, నేరెళ్లవలస గ్రామ పరిధిలోని భీమిలి బీచ్‌లో శ్రీ విజయ్ సాయి రెడ్డి గారి పాత భవనం సమీపంలోని సముద్ర తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం ఉన్నట్లు భోగ్గు రోడ్-2 సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న బింగి రాము పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృత మగ శిశువు బొడ్డుకు క్లిప్ అమర్చబడి ఉన్నట్లు గుర్తించారు. శిశువు గుర్తింపు మరియు మృతికి గల కారణాలపై చుట్టుపక్కల వారిని విచారించగా, తమకు ఎటువంటి సమాచారం తెలియదని వారు తెలిపారు.
అనంతరం మృత శిశువు మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై భీమిలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. దివాకర్ యాదవ్ కేసు నమోదు చేసి, మృత శిశువు గుర్తింపు మరియు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.




