Bheemili: ఆనందపురం, భీమిలిలో గంటా రవితేజ విజయోత్సవాలు!
Bheemili: భీమిలి, ఆనందపురం మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన ఎన్డీఏ కూటమి విజేతలను కౌంటింగ్ కేంద్రాల వద్ద యువ నాయకుడు గంటా రవితేజ కలిసి అభినందించారు.
Bheemili: ఆనందపురం, భీమిలిలో గంటా రవితేజ విజయోత్సవాలు!
ఆనందపురం, భీమిలి నవంబర్ 7: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని యువ నాయకుడు గంటా రవితేజ విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆనందపురం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని, అలాగే గోల్లలపాలెంలోని ది సెడార్ స్కూల్స్లో ఏర్పాటు చేసిన భీమిలి, పద్మనాభం మండలాల కౌంటింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద విజయం సాధించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి విజయోత్సవాల్లో పాల్గొని, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ.. ప్రజలు ఎన్డీఏ కూటమిపై ఉంచిన నమ్మకానికి ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని విజేతలకు సూచించారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి ఈ విజయానికి ప్రధాన బలమని ఆయన పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.




