Visakhapatnam: భీమిలిలో ప్రేమ జంటపై హత్యాయత్నం: 9 మంది అరెస్ట్

Visakhapatnam: విశాఖ జిల్లా భీమునిపట్నంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై, ఎస్బీ కానిస్టేబుల్‌పై కత్తులతో దాడికి పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేసి రౌడీషీట్లు తెరిచారు.

SHIVA, BHIMILI
Published on: 26 Sept 2026 9:55 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: భీమిలిలో ప్రేమ జంటపై హత్యాయత్నం: 9 మంది అరెస్ట్

విశాఖ జిల్లా: భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాలను భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో సీఐ దివాకర్ యాదవ్ శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు ప్రేమికులు రహస్య వివాహం నేపథ్యంలో నెలకొన్న వివాదం ధర్యాప్తు వేగవంతం చేసి దాడికి పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

భీమునిపట్నం మండలం మజ్జిపేటకు చెందిన తుపాకుల గంగరాజు, అర్బన్ పరిధి బంగ్లామెట్టకు చెందిన ఇంటి నీలిమ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో ప్రేమ వివాహం చేసుకున్నారన్నారు. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు తెలియజేసి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. యువతీ యువకులు ఇద్దరు మేజర్లు కావడంతో యువతి నిర్ణయం మేరకు ప్రేమికుడు గంగరాజు ఇంటికి బయలుదేరారన్నారు.

మార్గమధ్యంలో దారి కాసి ప్రేమికుడు, బంధువులతో పాటు ఎస్బి కానిస్టేబుల్ పై కత్తులు, కర్రలతో యువతి బంధువులు మూకుమ్మడి దాడి చేసి యువతిని తీసుకువెళ్లారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన 9 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసామన్నారు.

సీపీ శంఖభ్రత భాగ్ఛీ ఆదేశాలు మేరకు 9మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు. కత్తులు బీరు బాటిళ్ల తో దాడులతో పాటు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని సిఐ దివాకర్ యాదవ్ హెచ్చరించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI