Bheemili: ఎమ్మెల్యే గంటా సమక్షంలో టీడీపీలో చేరిన మజ్జిపేట వైసీపీ నేతలు
Bheemili: భీమిలి మండలం మజ్జిపేట వైసీపీ నేతలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ మజ్జి వెంకటరావు సహా 100 మందికి పసుపు కండువాలు.
Bheemili: ఎమ్మెల్యే గంటా సమక్షంలో టీడీపీలో చేరిన మజ్జిపేట వైసీపీ నేతలు
భీమిలి: విశాఖపట్నం భీమిలి మండలం మజ్జిపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మజ్జి వెంకటరావు సహా 100 మందికి పసుపు కండువాలు వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రగతిని చూసి వైసీపీ నాయకులు అనేక మంది టీడీపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో మజ్జి స్వామి నాయుడు, మజ్జి జానకి రావు, కోరాడ అప్పలరాజు, మజ్జి వనజ, ఎన్ని రామారావు, మజ్జి సోమునాయుడు, కాసు బాబు, కాదా రామారావు, యర్రాజీ వెంకటరావు, మజ్జి సూరినాయుడు, యర్రాజీ గౌరీ, నీలాపు అప్పారావు, మీసాల అప్పలరాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చిక్కాల విజయ్ బాబు, గాడు వెంకటప్పడు, సరగడ అప్పారావు, గాడు తాతినాయుడు, వెంకట నారాయణ, గుడ్డాల ఎల్లయ్య, మజ్జి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.




