Etapaka: ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌కు భద్రాచలం క్రీడాకారుడు ఎంపిక
Etapaka: అమెరికాలో జరిగే ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన భద్రాచలం క్రీడాకారుడు డి.వి. శంకర రావు ఆర్థిక సాయం కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు.
Etapaka: ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌కు భద్రాచలం క్రీడాకారుడు ఎంపిక
ఎటపాక: అమెరికాలోని రెనో,నెవాడాలో అక్టోబర్ 2026 లో జరగనున్న World Classic & Equipped Masters Powerlifting ఛాంపియన్షిప్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న భద్రాచలానికి చెందిన జాతీయ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ డి.వి.శంకర రావు పోటీలలో పాల్గొనేందుకు అవసరమైన వ్యయాల నిమిత్తం ₹5 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందించవలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన తన కోచ్ శ్రీ గొంగడి వెంకట రామిరెడ్డితో భద్రాచలం ఎమ్మెల్యే ను కలిసి ముఖ్యమంత్రికి పంపేందుకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.హార్ట్ బైపాస్ సర్జరీ అనంతరం పవర్‌లిఫ్టింగ్‌లోకి ప్రవేశించిన శంకర రావు జాతీయ స్థాయిలో అనేక పతకాలు,రికార్డులు సాధించారు. 2025 కోజికోడ్ జాతీయ పోటీలలో 4 బంగారు పతకాలు మరియు Overall Championship, 2026 ఫరీదాబాద్‌లో డైరెక్ట్ కాంస్య పతకం,2026 ఛత్రపతి సంభాజీనగర్ పోటీలలో 8 రజత పతకాలు సాధించారు.
ఇంకా 4 రికార్డు రికగ్నిషన్ సంస్థల నుంచీ India Book of Records తో కూడి గుర్తింపును పొందారు.ప్రస్తుతం Masters-4,74 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన ఆయన,ఈ పోటీలలో పతకం సాధిస్తే భారతదేశం, తెలంగాణ రాష్ట్రం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు భద్రాచలానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు తీసుకురావడమే కాకుండా, హార్ట్ బైపాస్ సర్జరీ అనంతరం ప్రపంచ స్థాయి పవర్‌లిఫ్టింగ్‌లో అరుదైన ఘనత సాధించిన క్రీడాకారుడిగా నిలిచే అవకాశం ఉందన్నారు.
తన క్రీడా ప్రయాణం సీనియర్ సిటిజన్స్‌కు,హార్ట్ సర్జరీ మరియు ఇతర వైద్య చికిత్సల అనంతరం కోలుకుంటున్న వారికి ధైర్యం,ఫిట్‌నెస్, క్రమశిక్షణ పై స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వం Khelo India,Khelo Bharat Niti, Fit India వంటి కార్యక్రమాల ద్వారా క్రీడలు,ఫిట్‌నెస్ మరియు అంతర్జాతీయ క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.




