Araku: అరకు, డుంబ్రిగుడలో స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్!

Araku: ZPTC, MPTC ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, CCTV నిఘాను పరిశీలించిన పాడేరు సబ్ కలెక్టర్. అరకు, డుంబ్రిగుడ, అనంతగిరిలలో కట్టుదిట్టమైన భద్రతకు ఆదేశం.

REHAMAN, ARAKU
Published on: 26 Oct 2026 6:13 PM IST
Araku
X

Araku: అరకు, డుంబ్రిగుడలో స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్!

అరకు: జిల్లాలో త్వరలో జరగబోయే ZPTC, MPTCల రెండవ సాధారణ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్స్, సీసీ కెమెరాస్ ఏర్పాటును అధికారుల సన్నాహాలు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా సోమవారం ఉదయం డుంబ్రిగుడ, అరకువ్యాలీ, అనంతగిరి మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లను, అక్కడ అమర్చిన సీసీ కెమెరాల ఏర్పాట్లను సబ్ కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, భద్రతతో జరగాలని స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల బ్యాలెట్ పెట్టెల (బాక్స్ )ల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉండేలా సీసీ కెమెరాల కవరేజ్ పక్కాగా ఉండాలని సంబంధిత మండల స్పెషల్ అధికారి, రిటర్నింగ్ అధికారులను, సిబ్బందికిఆదేశించారు.

స్ట్రాంగ్ రూమ్ లో భద్రతా లోపాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన పలు కీలక జాగ్రత్తలపై అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాట్ల పర్యవేక్షణలో మండల తహశీల్దార్స్, ఎంపీడీవోస్, స్ట్రాంగ్ రూమ్ ఇంచార్జిలు రెవిన్యూ, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU