Alluri: అల్లూరి జిల్లాలో నాట్య సంగమం, ఖేలో ASR పోస్టర్లు విడుదల

Alluri: అల్లూరి జిల్లాలో ‘ASR నాట్య సంగమం 2026’, ‘ఖేలో ASR’ గోడ పోస్టర్లతో పాటు అధికారిక టూరిజం వెబ్‌సైట్‌ను కలెక్టర్ నిషాంతి టి ప్రారంభించారు.

SAI, PADERU
Published on: 5 Oct 2026 9:25 PM IST
Alluri
X

Alluri: అల్లూరి జిల్లాలో నాట్య సంగమం, ఖేలో ASR పోస్టర్లు విడుదల

ఎ ఎస్ ఆర్ జిల్లా,పాడేరు/అరకు: అల్లూరి జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు స్కూల్ విద్యార్థులకు "A.S.R. నాట్య సంగమం 2026" సాంస్కృతిక వేడుకలతో పాటు,ప్రభుత్వం ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంపొందించేందుకు "ఖేలో A.S.R." (All Employees Sports Fest) క్రీడా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు, టూరిజం శాఖ కు అంబందించిన అల్లూరి వెబ్సైటును ప్రారంబిచిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిషాంతి.

టి, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి అదిత్య వర్మ, సబ్ కలెక్టర్ కె. సాహిత్,విజయనగరం జోన్ ఏపీ ఎస్ఆర్టిసి చైర్మన్ సీయారి దొన్నుదొర, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ ఒంపురు గంగులయ్య, ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ S.R. నాట్య సంగమం 2026 (Celebrating Young Talents):

జిల్లాలోని యువ కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు మరియు విభిన్న సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది ఒక విశిష్ట వేదికగా నిలవనుంది.

ఖేలో A.S.R. (క్రీడా మహోత్సవం):

"One District, One Team, One Spirit" అనే నినాదంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెస్తూ ఈ క్రీడా వేడుకలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, పాడేరు.

ప్రధాన విభాగాలు, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.

ఈ పోటీలు జిల్లా ప్రజలు, యువత ఉద్యోగులలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని, సంబంధిత వర్గాలన్నీ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

SAI, PADERU

SAI, PADERU