Paderu: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మెటీరియల్ టెండర్లు ఖరారు: జేసీ శ్రీపూజ

Paderu: ఏఎస్ఆర్ జిల్లాలో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రింటింగ్, పోలింగ్ మెటీరియల్ టెండర్లను జేసీ తిరుమాని శ్రీపూజ సమక్షంలో ఖరారు చేశారు.

SAI, PADERU
Published on: 12 Oct 2026 8:40 PM IST
Paderu
X

Paderu: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మెటీరియల్ టెండర్లు ఖరారు: జేసీ శ్రీపూజ

ఏ ఎస్ ఆర్ జిల్లా పాడేరు: గ్రామ పంచాయతీ, మండల పరిషత్ (MPTC), జిల్లా పరిషత్ (ZPTC) ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రింటింగ్, పోలింగ్ మెటీరియల్ సరఫరా కోసం నిర్వహించిన టెండర్లు ఖరారయ్యాయి.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధించిన పంచాయతీ అధికారులతో కలసి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ మెటీరియల్ సంబంధించి, సంబంధిత అధికారులతో, బిడ్డర్ల సమక్షంలో టెండర్ బాక్స్ ఓపెన్ చేయించి టెండర్ ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ప్రక్రియలో టెండర్ వివరాలు సంబందించి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీకి సంబంధించి మొత్తం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు వేయగా, అందులో ఇద్దరు (2) సాంకేతికంగా అర్హత సాధించారు. మొదటి వారిలో అతి తక్కువ ధరను కోడ్ చేసిన వారిని (L1) ఖరారు చేసిన "విశాఖపట్నం సూపర్‌ బజార్" వారికి టెండర్ కేటాయించడం జరిగింది.

అలాగే ఎంపీటీసీ & జడ్పీటీసీ ఎన్నికలు మెటీరియల్ సంబంధించి, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ పోలింగ్ మెటీరియల్ సరఫరాకు సంబంధించిన రెండొవ సంస్థ కు ( L1 ) ద్వారా "విశాఖపట్నం యువ ఎంటర్‌ప్రైజెస్" వారికి టెండర్ ఖరారైంది.

అనంతరం ఈ ప్రక్రియలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ టెండర్ ద్వారా పొందిన సంస్థలు గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ మెటీరియల్ సంబంధించి అధికారులు సూచించిన గడువులోగా, నిర్దిష్ట సమయంలో సంబంధిత మండలాలకు పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులోగా కచ్చితంగా పంపిణీ జరిగలని జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ పి.ఎస్ కుమార్, డిఎల్డిఓ జయప్రకాష్, పరిపాలన అధికారులు రంగారావు, సుందర్ రావు, బిడ్డర్స్ తదితరులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU