Paderu: పాడేరులో దెబ్బతిన్న కల్వర్టు: స్వయంగా పరిశీలించిన కలెక్టర్
Paderu: అల్లూరి జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టు పునరుద్ధరణ పనులను కలెక్టర్ టి. నిశాంతి, ఐటీడీఏ పీవో పరిశీలించారు.
Paderu: పాడేరులో దెబ్బతిన్న కల్వర్టు: స్వయంగా పరిశీలించిన కలెక్టర్
Paderu: పాడేరు మండలం, వంతాడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న కల్వర్టు దెబ్బతిన్న రిస్టోర్ పనులను జిల్లా కలెక్టర్ నిషాంతి. టి, ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ గురువారం భారీ వర్షినికి దెబ్బతిన్న కల్వర్ట్ పనులు పరిశీలించారు.
జిల్లా లో కిరిసిన వర్షం వల్ల వంతాడపల్లి లో కల్వర్టు తీవ్రంగా దెబ్బతినడంతో, ప్రయాణికులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు.ప్రమాదకరంగా మారిన కల్వర్టు వద్ద స్థానికులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఇసుక మూటలు (గన్ని బేగ్స్) వేసి చేపట్టిన తాత్కాలిక పునరుద్ధరణ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇసుక మూటలతో తాత్కాలికంగా రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే ఈ కల్వర్టుకు శాశ్వత మరమ్మతులు, నూతన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ వారిని పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనదారులు, బాటసారులు కల్వర్టు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు వహించాలని రేడియం స్టిక్కర్స్ , బార్కెడ్ ఏర్పాటు చేశామని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ ధ్రువకుమార్ జిల్లా కలెక్టర్ వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ శ్రీలక్ష్మి, ఈ ట్రైబల్ వెల్ఫేర్ ధ్రువ కుమార్, జె ఇ ట్రైబల్ వెల్ఫేర్ దుర్గా ప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాస్, డిఇ కె.వి రమణ, పాడేరు మండల్ తహిశీల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీవో తేజరతన్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, స్వర్ణ గ్రామ సెక్రెటరీ అమృతవాణి, రెవెన్యూ వీఆర్వో పద్మావతి, పంచాయతీ రాజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.




