Alluri: సీఎం వర్చువల్ రివ్యూలో తుఫాను చర్యలు వివరించిన కలెక్టర్!

Alluri: సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో అర్నబ్ తుఫాను ముందస్తు చర్యలను వివరించిన అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిషాంతి. 27, 28 తేదీల్లో డే స్కాలర్ బడులకు సెలవులు.

SAI, PADERU
Published on: 26 Oct 2026 5:31 PM IST
Alluri
X

Alluri: సీఎం వర్చువల్ రివ్యూలో తుఫాను చర్యలు వివరించిన కలెక్టర్!

అల్లూరి: అర్నబ్ తుఫాను నేపథ్యంలో హెచ్‌సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను వివరించిన కలెక్టర్ నిషాంతి టి.

అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి (HCM) సంబంధిత జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి పాల్గొని, జిల్లాలో తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను వివరించారు.

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లా, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, అధికారుల సమన్వయం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచడం, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం వంటి అంశాలను వివరించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 27, 28 తేదీల్లో డే స్కాలర్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అయితే, విద్యార్థుల భద్రత, సంరక్షణను దృష్టిలో ఉంచుకుని రెసిడెన్షియల్ పాఠశాలలకు సెలవు లేదని స్పష్టం చేశారు.

తుఫాను పరిస్థితుల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని, అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతితో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆదిత్య వర్మ పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU