Araku: టీడీపీలో వైఎస్సార్‌సీపీ నేతల చేరిక ప్రచారం అవాస్తవం

Araku: వైసీపీ నేతలు టీడీపీలో చేరారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. స్థానిక సంస్థల ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారు.

REHAMAN, ARAKU
Published on: 2 Oct 2026 6:39 PM IST
Araku
X

Araku: టీడీపీలో వైఎస్సార్‌సీపీ నేతల చేరిక ప్రచారం అవాస్తవం

అరకు: అరకువ్యాలీ మండల పరిధిలోని పెదలబుడు, పద్మాపురం అనంతగిరి మండలం వాలసి పంచాయతీలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పష్టం చేశారు.

అరకు టీడీపీ ఇన్‌ఛార్జి సియ్యారి దొన్ను దొర సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. అరకు నియోజకవర్గంలో రోజురోజుకూ తప్పుడు ప్రచారాలు చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.

పెదలబుడు, పద్మాపురం, వాలసి పంచాయతీలకు చెందిన టీడీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నారని, వైసీపీ తరఫున ఎప్పుడూ పనిచేయలేదని స్పష్టం చేశారు.

అరకు నియోజకవర్గంలో వైసీపీకి ప్రజాదరణ చెక్కుచెదరలేదు

అరకు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ కొనసాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను తప్పుడు ప్రచారాలతో తగ్గించలేరని అన్నారు.

"రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో 90 శాతం స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలకు స్వస్తి పలకాలని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఈ సందర్భంగా కోరారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU