Araku: అరకులో భారీ చేరికలు: టీడీపీలోకి 550 మందికి పైగా
Araku: అరకు నియోజకవర్గం పెదబయలు మండలం జముగూడలో 14 గ్రామాల నుంచి 550 మందికి పైగా ప్రజలు జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, డొన్ను దొర సమక్షంలో టీడీపీలో చేరారు.
Araku: అరకులో భారీ చేరికలు: టీడీపీలోకి 550 మందికి పైగా
అరకు: అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం పెదబయలు మండలం జముగూడ పంచాయతీలో మండల అధ్యక్షుడు కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (GCC) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అరకు ఇన్చార్జి మరియు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ డొన్ను దొర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జముగూడ పంచాయతీ పరిధిలోని 14 గ్రామాలకు చెందిన 550 మందికి పైగా ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కిడారి శ్రావణ్ కుమార్, డొన్ను దొర పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి జరుగుతోందని తెలిపారు. గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
డొన్ను దొర మాట్లాడుతూ.. జముగూడ పంచాయతీ పరిధిలోని 14 గ్రామాల నుంచి 550 మందికి పైగా ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామస్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను నాయకులకు వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1 లక్ష విలువైన చెక్కును కిడారి శ్రావణ్ కుమార్, డొన్ను దొర కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజారావు, మాజీ సర్పంచులు పాండురంగస్వామి, అశోక్, పీఏసీఎస్ చైర్మన్ ప్రసాద్, మాజీ మండల అధ్యక్షురాలు సుకుమారి, ఎంపీటీసీ రాధ, టీడీపీ నాయకులు భూషణ్, శాంసన్, త్రినాథ్, కోటి, కొండబాబు, అచ్చిబాబు, శేషు, మల్లేష్ తదితరులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.




