Araku: అరకులో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు: కూటమి నేతల ప్రకటన!
Araku: అరకు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని, సోషల్ మీడియాలో సొంత ప్రచారాలు చేసుకోవద్దని కూటమి నాయకత్వం విజ్ఞప్తి చేసింది.
Araku: అరకులో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు: కూటమి నేతల ప్రకటన!
అరకు: అరకు నియోజకవర్గంలో జడ్పిటిసి, ఎంపిటిసి సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది... కూటమి పార్టీల సమన్వయ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది. ఏ ఒక్కరినీ ఇప్పటి వరకు ఫలానా స్థానం నుంచి ఫలానా అభ్యర్థి పోటీ చేస్తున్నారని తెలుగుదేశం కానీ, బిజెపి గానీ, జనసేన గానీ ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.
కూటమి పార్టీల ధర్మాన్ని కాపాడుకుంటూ అభ్యర్థులు ఎంపిక జరుగుతుందని విషయం గుర్తుతెరగాలి. తొందరపాటుతోనో అవగాహన లేనితోనో ఎవరికి వారే తామే అభ్యర్థులమనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేసుకోవడం వలన కూటమి ధర్మానికి తూట్లు పొడిచిన వాళ్ళమవుతాం. ఆశావహులు మధ్య అలజడి సృష్టించిన వాళ్ళమవుతాం.
దయచేసి కూటమి పార్టీల సమన్వయ కమిటీ అంతిమంగా అభ్యర్థుల ప్రకటన చేసే వరకు ఎవరూ దయచేసి వారి పేరు వ్యక్తిగత సోషల్ మీడియా వేదికలపై తానే జడ్పిటిసి అభ్యర్థిననో , తానే ఎంపిటిసి అభ్యర్థిననో తానే సర్పంచ్ అభ్యర్థననో తెలియజేస్తూ పోస్టర్లు, వీడియోలు పెట్టవద్దు. దయచేసి విషయంలో ఓపిక పట్టాలన్నది మా వినతి.




