Araku: టీడీపీకి గట్టి షాక్ - వైఎస్సార్‌సీపీలోకి భారీ వలసలు
Araku: అరకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
Araku: టీడీపీకి గట్టి షాక్ - వైఎస్సార్‌సీపీలోకి భారీ వలసలు
అరకు: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారి ఆధ్వర్యంలో చేరికలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం,సంక్షేమ పథకాలకు కోత పెట్టడంపై తీవ్ర అసంతృప్తితో అరకు నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి.
ఈ రోజు పెదబయలు మండలం,ఇంజరి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు గెమ్మెలి ప్రసాద్, కొర్ర బొంజి నాయుడు, కిల్లో నూకరాజు,వంతల మల్లేశ్వరరావు, పి.రాజారావు,గేమ్మెలి సంజీవ్ రావు,కొర్ర సూరి,కొర్ర నాగరాజు, కిముడు ముత్యం నాయుడు,కోటి బాబు,బౌడు చంద్రశేఖర్,కిముడు గోపాల్ నాయుడు,బోరి కృష్ణారావు,పాంగి భాస్కరరావు గార్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారి ఆధ్వర్యంలో YSRCP లో చేరారు. వారికి ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను చూసి,ఆయన నాయకత్వంపై నమ్మకంతో పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతమని,మీకు పార్టీలో తగిన గౌరవం,ప్రాధాన్యత,సముచిత స్థానం కల్పిస్తామని,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి సేవలను సద్వినియోగం చేసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




