Hukumpeta: అల్లూరి జిల్లా హుకుంపేటలో వైఎస్సార్‌సీపీ సన్నాహక భేటీ!

Hukumpeta: అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజ రాణి పిలుపు.

SAI, PADERU
Published on: 28 Oct 2026 8:32 AM IST
Hukumpeta
X

Hukumpeta: అల్లూరి జిల్లా హుకుంపేటలో వైఎస్సార్‌సీపీ సన్నాహక భేటీ!

Hukumpeta: అల్లూరి జిల్లా అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో హుకుంపేట మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజ రాణి పిలుపునిచ్చారు.

హుకుంపేట మండల జడ్పీటీసీ అభ్యర్థి ఒంటుబు ప్రియాంక, ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజ రాణి, యువ నాయకుడు చెట్టి వినయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్య సాధనలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు పూర్తి సహాయ సహకారాలతో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడేలా పార్టీ శ్రేణులు కృషి చేసి వైఎస్ఆర్ సీపీ బలపరిచిన, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజలతో నిరంతరం మమేకమవ్వాలని సూచించారు.

హుకుంపేట మండలంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల అధ్యక్షుడు అనిల్‌తో పాటు సీనియర్ నాయకులు కాసులమ్మ, సివేరి కోడలరావు, రామకృష్ణ, కొండబాబు, జన్ని సింహాచలం, పాంగి సింహాచలం, సుశీల, సామ్యూల్, సాంబా, కోటిబాబు, మహేష్ తదితర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU