Araku: ముంపు ప్రాంతాల ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత: అరకు ఎంపీ!
Araku: భారీ వర్షాల వేళ ప్రజల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలి: అధికారులకు అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి ఆదేశం. ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.
Araku: ముంపు ప్రాంతాల ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత: అరకు ఎంపీ!
Araku: భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్లు, భవనాలు దెబ్బతినే అవకాశం ఉన్న ప్రాంతాలను అధికారులు ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యతగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనూజ రాణి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సైతం అప్రమత్తంగా మెలగాలని సూచించారు.




