Araku: ఏపీఆర్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
Araku: అరకు ఎండపల్లివలస ఏపీఆర్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థినులతో మాట్లాడి వసతులను పరిశీలించారు.
Araku: ఏపీఆర్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
అరకు: ఈ రోజు అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండల కేంద్ర పరిధిలోని ఎండపల్లివలస ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ (ఏపీఆర్) బాలికల పాఠశాలను అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే గారు ముందుగా తరగతి గదులను, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వసతి గృహం, వంటశాల, మరుగుదొడ్లను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా ముచ్చటిస్తూ - భోజనం నాణ్యత, బోధన, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి హాజరు, మెనూ, స్టాక్ రిజిస్టర్లతో సహా అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బాలికల విద్య, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.




