Araku: కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన అరకు ఎమ్మెల్యే!

Araku: అరకు-పాడేరు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తక్షణ సహాయం అందించి ఆస్పత్రికి తరలించారు.

REHAMAN, ARAKU
Published on: 18 Oct 2026 9:18 AM IST
Araku
X

Araku: కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన అరకు ఎమ్మెల్యే!

Araku: ఈ రోజు అరకు వ్యాలీ నుండి పాడేరు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారు తక్షణ సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. అరకు వ్యాలీ నుండి పాడేరు వెళ్తుండగా మార్గమధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే గారు ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్ ను ఆపారు. క్షతగాత్రుడి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే గారు,ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా అక్కడే ఉండి,ఆటోను మాట్లాడి,క్షతగాత్రులను డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పిహెచ్సి) తరలించారు.

అనంతరం పిహెచ్సి వైద్య సిబ్బందితో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు చూపిన చొరవ,మానవతా దృక్పథం పట్ల స్థానిక ప్రజలు,ప్రత్యక్ష సాక్షులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కష్టంలో అండగా నిలబడే నిజమైన ప్రజా నాయకుడని కొనియాడారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU