Araku: వైసీపీ కార్యకర్తలకు భారీ బీమా ధీమా: ఎమ్మెల్యే మత్స్యలింగం

Araku: వైసీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. మడగడలో ఐడీ కార్డులు పంపిణీ చేశారు.

REHAMAN, ARAKU
Published on: 3 Oct 2026 6:57 PM IST
Araku
X

Araku: వైసీపీ కార్యకర్తలకు భారీ బీమా ధీమా: ఎమ్మెల్యే మత్స్యలింగం

Araku: ఈ రోజు అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండలం మడగడ గ్రామ పంచాయతీ కేంద్రం వద్ద వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన పంచాయితీ స్థాయిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత,బూత్ కమిటీల పటిష్టత మరియు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు మాట్లాడుతూ...

వైసీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

ఐడీ కార్డు కలిగిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి రూ.2 లక్షల బీమా, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని,ఈ పథకం ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం కరువైందని విమర్శించారు. జగన్ గారి హయాంలో గ్రామ గ్రామాన సంక్షేమ కార్యక్రమాలు జరిగేవని అన్నారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి కింద రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000, ఫీజు రీయింబర్స్మెంట్, అన్నదాత సుఖీభవ కింద రూ.20000, వసతి దీవెన, విద్యా దీవెన, తల్లికి వందనం పథకాలను పూర్తిస్థాయిలో అందించలేదని, కొత్త పింఛన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

వైసీపీ హయాంలో నవరత్నాలు అని చెప్పి, చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఇంటి వద్దకే బియ్యం, ఇంటి వద్దకే పింఛన్ అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి ఇంటి వద్దకే సంక్షేమం అందించిన ఘనత మాజీ సీఎం జగన్ గారిదేనని అన్నారు.

సూపర్ సిక్స్ అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లలో కోత విధించిందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి అశోక్ గారు

మాజీ ఎంపీపీ జన్ని నరసింహమూర్తి గారు

మండల కార్యదర్శి గుంజేడి ప్రసాద్ గారు

మాజీ ఎంపీటీసీ సభ్యులు సమర్ధి శత్రుగును గారు,స్వాభి రామచంద్ర గారు

మాజీ సర్పంచులు జ్యోతి గారు,కిల్లో జగన్ కుమార్ గారు

వైసీపీ అరకు వ్యాలీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నగేష్ గారు

వైసీపీ అరకు వ్యాలీ మండలం బూత్ కమిటీ ఇన్చార్జ్ కొర్ర అర్జున్ రావు గారు

డివిజనల్ యూత్ వింగ్ కార్యదర్శి మండ్యకేడ్డి బాలరాజు గారు

నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU