Araku: కాంట్రాక్టర్ల దోపిడీ.. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే మత్స్యలింగం ఫైర్!

Araku: అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట సచివాలయ భవనం అసంపూర్తిగా మిగలడంపై ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు.

REHAMAN, ARAKU
Published on: 16 Sept 2026 7:33 PM IST
Araku
X

Araku: కాంట్రాక్టర్ల దోపిడీ.. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే మత్స్యలింగం ఫైర్!

అరకు: ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు మాట్లాడుతూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో సుపరిపాలన లక్ష్యంతో మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి,ప్రతి సచివాలయానికి రూ.45 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి,రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారన్నారు.

కానీ నేటికీ అరకు నియోజకవర్గంలో అనేక సచివాలయ భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయని,అందులో భాగంగానే అరకు వ్యాలీ మండలం"సుంకరమెట్ట గ్రామ సచివాలయం స్లాబ్ దశలోనే ఆగిపోయి పిచ్చి మొక్కలతో శిథిలావస్థకు చేరిందన్నారు.ఇది అధికారుల నిర్లక్ష్యమా,కాంట్రాక్టర్లు నిధులు డ్రా చేసుకుని వదిలేయడమా అని ప్రశ్నించారు.

గతంలో కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారి హయాంలో విచారణ జరిపి,నిధులు తీసుకున్న కాంట్రాక్టర్లకు ఎమ్మార్వోల ద్వారా నోటీసులు ఇచ్చి,భవనాలు పూర్తి చేయాలని లేదా నిధులు ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు.అయినా ఇప్పటివరకు భవనాలు పూర్తి కాలేదు,డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదని,ఇది దుర్మార్గమని మండిపడ్డారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తి భవనాలను పూర్తి చేయాలని,లేకుంటే కాంట్రాక్టర్ల నుండి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.అలా చేయని పక్షంలో వైసీపీ తరపున సొమ్ము వసూలు అయ్యే వరకు పోరాడుతామని,నిధులు డ్రాకు సహకరించిన అధికారులు,కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోతే,అసంపూర్తి సచివాలయాల పరిధి ప్రజలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ అరకు వ్యాలీ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి,యువజన విభాగం నాయకులు కొర్ర రమేష్,సీనియర్ నాయకులు బూర్జబరికి కామేష్ తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU