Anakapalli: అరబిందో ఫార్మా ప్రమాదంపై స్పందించిన హోం మంత్రి వంగలపూడి అనిత!

Anakapalli: అనకాపల్లి జిల్లా అరబిందో ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 23 Oct 2026 8:45 AM IST
Anakapalli
X

Anakapalli: అరబిందో ఫార్మా ప్రమాదంపై స్పందించిన హోం మంత్రి వంగలపూడి అనిత!

Anakapalli: అరబిందో పరిశ్రమలో అగ్నిప్రమాదంపై స్పందించిన హోం మంత్రి వంగలపూడి అనిత. అగ్నిప్రమాద ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి అనిత. అరబిందో పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీసిన హోం మంత్రి.

అగ్నిప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న మంత్రి అనిత. అగ్నిప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన హోం మంత్రి. ఘటనాస్థలిలో అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి అనిత.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.