Nakkapalli: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదన్న హోంమంత్రి!

Nakkapalli: పంచాయతీ ఎన్నికల్లో హోంమంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి జెడ్పీ హైస్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 29 Nov 2026 12:18 PM IST
Nakkapalli
X

Nakkapalli: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదన్న హోంమంత్రి!

Nakkapalli: నక్కపల్లి, నవంబర్ 29: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం నక్కపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆమె తన ఓటును వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు.

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.