Anandapuram: ఆనందపురంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్: 100 మందికి ఫైన్
Anandapuram: విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో ఆనందపురం-భీమిలి రహదారిపై ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 100 మందికి జరిమానాలు విధించారు.
Anandapuram: ఆనందపురంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్: 100 మందికి ఫైన్
ఆనందపురం: విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వుల మేరకు శనివారం భీమిలి క్రాస్ రోడ్డు నుంచి ఆనందపురం వచ్చు రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నార్త్ ట్రాఫిక్ సీఐ సీహెచ్.ఉమాకాంత్, ఆనందపురం ట్రాఫిక్ ఎస్సై పి.పాపారావు ఆధ్వర్యంలో అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్ ఉపయోగించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అతివేగం, హెల్మెట్ లేకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్,ట్రిపుల్ రైడింగ్‌లకు పాల్పడిన 100మంది వాహనదారులను గుర్తించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించినట్లు ఎస్సై పాపారావు తెలిపారు.




