Anandapuram: చంద్రబాబు విజన్‌తోనే మిగులు విద్యుత్ - ఎమ్మెల్యే గంటా

Anandapuram: ఆనందపురంలో పీఎం సూర్యఘర్ సేవా సేతు అభియాన్‌లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. చంద్రబాబు విజన్‌తోనే మిగులు విద్యుత్ సాధ్యమైందన్నారు.

SHIVA, BHIMILI
Published on: 8 Oct 2026 6:36 PM IST
Anandapuram
X

Anandapuram: చంద్రబాబు విజన్‌తోనే మిగులు విద్యుత్ - ఎమ్మెల్యే గంటా

ఆనందపురం: విద్యుత్ సంస్కరణలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను మిగులు విద్యుదుత్పత్తి రాష్ట్రంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆనందపురం మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ సేవా సేతు అభియాన్ లో ఆయన పాల్గొన్నారు.

సౌర విద్యుత్ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో పీఎం నరేంద్ర మోడీ సూర్యఘర్ పథకాన్ని రూపొందించారన్నారు. నెట్ జీరో లక్ష్యంగా ప్రభుత్వ కార్యాలయాలపై సౌర పలకలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన భీమిలిని విద్యుదుత్పత్తిలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని సూచించారు.

సబ్సిడీతో అందిస్తున్న సౌర పలకలను ఇళ్లపై ఏర్పాటు చేసుకుని ప్రజలంతా సూర్య ఘర్ ఫలితాలు పొందాలని కోరారు. అతి తక్కువ సరఫరా నష్టాలతో ఈ.పి.డి.సి.ఎల్. దేశంలోనే అత్యుత్తమమైన కంపెనీగా నిలిచిందని ప్రశంసించారు. అంతకుముందు సౌర విద్యుత్ కు సంబంధించిన స్టాల్స్ ను సందర్శించారు.

సేవా సేతు అభియాన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్.ఈ. సింహాద్రి నాయుడు, ఈ.ఈ. పోలాకి శ్రీనివాస్, ఏడీఈలు రాజశేఖర్, కిరణ్ కుమార్, సాయి సుధాకర్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, సుభాష్ చంద్రబోస్, బి.ఆర్.బి. నాయుడు, కసిరెడ్డి దామోదరరావు, బమ్మిడి ఉమ, పాండ్రంగి అప్పలరాజు, అప్పల రాము తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI