Anakapalli: అనకాపల్లి వైసీపీకి షాక్: జనసేనలోకి కొణతాల మురళి!

Anakapalli: అనకాపల్లిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ కొణతాల మురళి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 22 Oct 2026 10:03 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి వైసీపీకి షాక్: జనసేనలోకి కొణతాల మురళి!

అనకాపల్లి: స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లి పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ కొణతాల మురళి తన మిత్రబృందంతో కలిసి జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లిలో చోటుచేసుకున్న ఈ రాజకీయ చేరిక స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో కొణతాల మురళి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఏపీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కొణతాల మురళి తన మిత్రబృందంతో కలిసి జనసేనలో చేరడం అనకాపల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చేరికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI