Anakapalli: 112వ డివిజన్‌లో వైసీపీకి షాక్.. జనసేనలో చేరికలు!

Anakapalli: అనకాపల్లి 112వ డివిజన్ ఏఎంసీ కాలనీ వైసీపీ నాయకులు కటారి హరీష్, రాము, మనోజ్ కుటుంబసమేతంగా జనసేన ఇన్ ఛార్జ్ భీమరశెట్టి రాంకీ సమక్షంలో చేరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 24 Oct 2026 4:27 PM IST
Anakapalli
X

Anakapalli: 112వ డివిజన్‌లో వైసీపీకి షాక్.. జనసేనలో చేరికలు!

అనకాపల్లి: అనకాపల్లి నగరంలోని 112వ డివిజన్‌ ఏఎంసీ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి భీమరశెట్టి రాంకీ సమక్షంలో కటారి హరీష్, కటారి రాము, కటారి మనోజ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, అనకాపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బర్నికాన రాంబాబుతో పాటు ఏఎంసీ కాలనీకి చెందిన కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు పార్టీలో నూతనంగా చేరిన వారికి స్వాగతం పలికారు. స్థానికంగా చోటుచేసుకున్న ఈ చేరికలతో 112వ డివిజన్‌లో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI