Anakapalli: జేసీ స్వయంగా పరిశీలించాలి - గిరిజన రైతుల ఆవేదన

Anakapalli: కొమిరిలో రీసర్వే పేరుతో డి-పట్టా భూములు గేయాలుగా మార్పు. మైనింగ్ వ్యర్ధాలతో దెబ్బతిన్న పంట పొలాలు. అనకాపల్లి జేసీ స్పందించి పరిశీలించాలని బాధితుల విజ్ఞప్తి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 17 Sept 2026 11:02 AM IST
Anakapalli
X

Anakapalli: జేసీ స్వయంగా పరిశీలించాలి - గిరిజన రైతుల ఆవేదన

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రావికమ త మండలం కొమిరి రెవెన్యూ పరిధిలో రైతులు 1985 సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం డి - పట్టా. భూముల్లో జీడి తోటలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు 10 గిరిజన రైతులు తోపాటు ఇతర పేదలు. రీ సర్వే తర్వాత ఈ భూములన్ని గే య్యాల భూములుగా రికార్డులు మారిపోయాయి.

కొమిరిగ్రామపంచాయతీ కేంద్రాల్లో రెవెన్యూ సదస్సులో. రెండుసార్లు నిర్వహించారు. ఫిర్యాదు చేసాం కనీసం పట్టించుకోలేదు. మరువైపు ఉర్ల కొండపై కొండపై సింగారపు గడ్డ. దూదేకుల గడ్డ. మైనింగ్ కార్యకలాపాల వల్ల దాంసం అయినాయి. ఈ గడ్డలన్నీ ఊట గడ్డలు ద్వారా మా పంట పొలాలు గ్రానైట్ వ్యర్ధాలు మ్యాట్ల వేసేశాయి.

కొంతమంది రైతులు వేలాది రూపాయలు పెట్టి వ్యర్ధాలు తొలగించుకున్నారు. మా గిరిజన పేద రైతులు డబ్బులు లేక ఆ వ్యర్ధాలను ఎటువంటి తొలగింపు చేయకుండా అలాగే వదిలేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ గారికి. నర్సీపట్నం ఆర్డిఓ గారికి. రావికతం వి మాడుగుల ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేసిన కనీసం సందర్శించడం కూడా లేదు. మైనింగ్ మాఫియా చేతుల్లో అధికారి యంత్రాంగం ఉండడంవల్ల మా భూములకు రక్షణ కల్పించలేదు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.