Anakapalli: చరిత్ర తిరగరాసిన వెంకుపాలెం పంచాయతీ.. ఏకగ్రీవ ఎన్నిక

Anakapalli: అనకాపల్లి మండలం వెంకుపాలెం పంచాయతీ 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి సర్పంచ్‌తో పాటు 10 వార్డులకూ ఏకగ్రీవ ఎన్నిక; సర్పంచ్‌గా బుద్ధ ఘనసిరి శివనాయుడు ఎన్నిక.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 21 Nov 2026 9:22 PM IST
Anakapalli
X

Anakapalli: చరిత్ర తిరగరాసిన వెంకుపాలెం పంచాయతీ.. ఏకగ్రీవ ఎన్నిక

అనకాపల్లి: అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 1996లో గ్రామపంచాయతీగా ఏర్పడిన వెంకుపాలెంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత సర్పంచ్‌తో పాటు మొత్తం 10 వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడంతో గ్రామమంతా సంబరాల్లో మునిగిపోయింది.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి నాయకులు చేసిన కృషికి గ్రామ ప్రజలు మద్దతు పలికారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్‌కీ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో గ్రామమంతా ఒక్కతాటిపైకి వచ్చింది.

వర్గ విభేదాలకు తావులేకుండా.. అభివృద్ధి బాటలో ముందుకు సాగాలన్న సంకల్పంతో గ్రామ ప్రజలు ఏకగ్రీవ ఎన్నికలకు మద్దతు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బుద్ధ ఘనసిరి శివనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 10 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గ్రామంలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా శివనాయుడు మాట్లాడుతూ.. తనకు అన్ని విధాలా అండగా నిలిచిన కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. 30 ఏళ్ల పంచాయతీ ప్రస్థానంలో.. ఐక్యతకు పట్టం కట్టిన వెంకుపాలెం!

సర్పంచ్‌తో పాటు 10 వార్డులకూ ఏకగ్రీవ ఎన్నికలు జరగడంతో వెంకుపాలెం గ్రామం చరిత్ర తిరగరాసింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం కోసం గ్రామమంతా ఒక్కటైన ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI