Anakapalli: పంచాయతీల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం: తుమ్మపాలలో కూటమి సమావేశం!

Anakapalli: అనకాపల్లి మండలం తుమ్మపాలలో కూటమి నేతల కీలక సమావేశం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా సమన్వయ కార్యాచరణను ఖరారు చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 10 Nov 2026 9:25 PM IST
Anakapalli
X

Anakapalli: పంచాయతీల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం: తుమ్మపాలలో కూటమి సమావేశం!

అనకాపల్లి: అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై చర్చించారు.

అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ నాయకత్వంలో కూటమి బలాన్ని మరోసారి నిరూపించుకునేలా సమష్టిగా ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు.

మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యాచరణ రూపొందించారు. ఇదే సమావేశంలో ఇటీవల విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను నాయకులు అభినందించి సత్కరించారు. రానున్న ఎన్నికల్లోనూ ఇదే విజయ పరంపర కొనసాగించాలని పిలుపునిచ్చారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI