Anakapalli: జీవీఎంసీ 112వ వార్డు కూటమి అభ్యర్థి ఆళ్ల వైష్ణవికి మద్దతు!

Anakapalli: అనకాపల్లి జిల్లా జీవీఎంసీ 112వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల వైష్ణవికి మద్దతు ప్రకటించిన ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధులు, స్థానికులు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 27 Oct 2026 3:53 PM IST
Anakapalli
X

Anakapalli: జీవీఎంసీ 112వ వార్డు కూటమి అభ్యర్థి ఆళ్ల వైష్ణవికి మద్దతు!

Anakapalli: అనకాపల్లి జిల్లా జీవీఎంసీ 112వ వార్డు ఎన్నికల ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వార్డు టీడీపీ ఇంచార్జ్ పొలారుపు త్రినాథ్ ఆధ్వర్యంలో, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ సమక్షంలో ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధులు, స్థానిక ప్రజలు సమావేశమై కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల వైష్ణవికి తమ మద్దతు ప్రకటించారు.

వార్డు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, అభ్యర్థి ఆళ్ల వైష్ణవి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించినట్లు వెల్లడించారు. వార్డు పరిధిలోని సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తామంతా ఏకతాటిపైకి వచ్చామని తెలిపారు.

ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న వేళ 112వ వార్డులో ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధులు, ప్రజలు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పొలారుపు త్రినాథ్, సబ్బవరపు గణేష్‌తో పాటు పలువురు సామాజిక వర్గ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI