Anakapalli: ఉద్యోగుల 'చలో విజయవాడ'కు అనుమతి లేదు

Anakapalli: అనకాపల్లిలో స్వర్ణ గ్రామం, వార్డు ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి నిరాకరణ. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ తుహిన్ సిన్హా.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 26 Sept 2026 8:39 PM IST
Anakapalli
X

Anakapalli: ఉద్యోగుల 'చలో విజయవాడ'కు అనుమతి లేదు

అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగస్తులు సెప్టెంబర్ 27న తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహించనున్న “చలో విజయవాడ” కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేసారు.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల భద్రత, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు మరియు అత్యవసర సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమ తమ విధులు నిర్వహించే ప్రదేశాల్లో అందుబాటులో ఉండి, వర్షాలు మరియు వరదల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాల్సి సమయం అని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు చెందిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగస్తులు విధులకు గైర్హాజరై “చలో విజయవాడ” కార్యక్రమానికి వెళ్లడానికి అనుమతి లేదన్నారు.

ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగలు తమకు కేటాయించిన విధుల్లో తప్పనిసరిగా హాజరై, స్థానికంగా ప్రజలకు అవసరమైన రెవెన్యూ సేవలు, విపత్తు నిర్వహణ చర్యలు మరియు ప్రభుత్వ ఆదేశాల అమలులో సహకరించాలన్నారు.

ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరై కార్యక్రమానికి హాజరయ్యే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని, కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అదేవిధంగా ప్రభుత్వ సర్వీస్‌ నియమాలకు అనుగుణంగా కఠినమైన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయన్నారు.

జిల్లాలో ప్రతి బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.

అందువల్ల జిల్లాలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగస్తులు ప్రస్తుత విపత్తు పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమ విధులకు హాజరై ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM