Anakapalli: కొత్త తలారివానపాలెంలో ఘనంగా దుర్గాదేవి అమ్మవారి ముహూర్త రాట
Anakapalli: అనకాపల్లి జిల్లా కొత్త తలారివానపాలెం శ్రీ నూకాంబిక ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముహూర్త రాట కార్యక్రమం నిర్వహించారు.
Anakapalli: కొత్త తలారివానపాలెంలో ఘనంగా దుర్గాదేవి అమ్మవారి ముహూర్త రాట
Anakapalli: కొత్త తలారివానపాలెం శ్రీ నూకాంబిక ఆలయ మండపం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలకు శ్రీకారం అనకాపల్లి జిల్లా కొత్త తలారివానపాలెం గ్రామంలో దుర్గాదేవి అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. శ్రీ నూకాంబిక ఆలయ మండపం వద్ద గ్రామస్థులంతా కలిసి సంప్రదాయబద్ధంగా ముహూర్త రాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీ నూకాంబిక ఆలయ మండపం వద్ద తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు.
అలాగే గ్రామస్తులు అమ్మవారి మాలలు ధరించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ కల్పవల్లిగా అమ్మవారిని కొలుస్తామని పేర్కొన్నారు. దసరా పర్వదినం సందర్భంగా అమ్మవారిని ఘటాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.
గత 13 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలను గ్రామస్థుల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా శరన్నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వేపాడ సంతోష్, దాసరి గోపాల్, తలారి రమణమ్మ, తలారి మంగమ్మ, పడాల బుజ్జమ్మతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.




