Anakapalli: నులిపురుగుల రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ విజయ కృష్ణన్!

Anakapalli: అనకాపల్లిలో జాతీయ నులిపురుగుల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ: సెప్టెంబర్ 25న 1-19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ అని తెలిపిన కలెక్టర్ విజయ కృష్ణన్.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 24 Sept 2026 4:40 PM IST
Anakapalli
X

Anakapalli: నులిపురుగుల రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ విజయ కృష్ణన్!

అనకాపల్లి: ఈనెల 25న జిల్లా వ్యాప్తంగా జాతీయ నలిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నులిపురుగుల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు కౌమార బాల బాలికలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయడం జరుగుతుందని, పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా ఆల్బెండజోల్ 400 మి.గ్రా. మాత్రలను విద్యార్థులకు అందిస్తారని కలెక్టర్ తెలిపారు.

ఈ మాత్రలు సెప్టెంబర్ 25వ తేదీన తీసుకోలేకపోయిన పిల్లల కోసం ప్రత్యేకంగా మోప్-అప్ రోజున (అక్టోబర్ 5వ తేదిన) ఈ మాత్రలను అందిస్తారు. పిల్లల్లో రక్తహీనతను నివారించి, వారి శారీరక, మానసిక ఆరోగ్య వికాసానికి నులిపురుగుల నివారణ ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.

కావున తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.అచ్చుతకుమారి మరియు డి సి హెచ్ ఎస్ డా.శ్రీనివాస్ పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM