Anakapalli: అనకాపల్లిలో 'నమో సేవా గాధ' నాటిక ప్రదర్శనకు విశేష స్పందన

Anakapalli: అనకాపల్లిలో జరిగిన 'నమో సేవా గాధ' నాటిక ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. కూటమి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 29 Sept 2026 11:03 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో 'నమో సేవా గాధ' నాటిక ప్రదర్శనకు విశేష స్పందన

అనకాపల్లి: భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో, సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో నిర్వహించిన ‘నమో సేవా గాధ’ నాటికకు విశేష స్పందన లభించింది.

అనకాపల్లి నూకాలమ్మ గుడి సమీపంలోని శ్రీ సత్య లక్ష్మీ గ్రాండ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యం వహించగా, సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ దర్శకత్వంలో నాటిక ప్రదర్శన జరిగింది.

కార్యక్రమానికి హాజరైన జనసేన అనకాపల్లి ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కీ నాటికను ఆసక్తిగా వీక్షించారు. కళాకారుల అద్భుత ప్రదర్శనను అభినందించి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబాబు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రమాకుమారి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI