Anakapalli: అనకాపల్లిలో ప్రజా సమస్యల వినతుల స్వీకరణ!

Anakapalli: అనకాపల్లి జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Oct 2026 10:35 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో ప్రజా సమస్యల వినతుల స్వీకరణ!

Anakapalli: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్థానిక ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వాటిని శ్రద్ధగా విని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని కొణతాల రామకృష్ణ తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI