Anakapalli: అనకాపల్లిలో జనసేన క్లీన్ స్వీప్: 13కి 13 ఎంపీటీసీలు కైవసం!

Anakapalli: అనకాపల్లి మండల ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన 13 స్థానాల్లో పోటీ చేసి 13 చోట్లా ఘన విజయం సాధించింది. టీడీపీ 11 స్థానాలు గెలవగా, బీజేపీ ఏకైక స్థానాన్ని కోల్పోయింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 7 Nov 2026 8:42 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో జనసేన క్లీన్ స్వీప్: 13కి 13 ఎంపీటీసీలు కైవసం!

అనకాపల్లి: అనకాపల్లి మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కూటమి పార్టీల మధ్య ఆసక్తికరమైన రాజకీయ చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా జనసేన పార్టీ తనకు కేటాయించిన స్థానాలన్నింటినీ కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. అనకాపల్లి మండలంలో మొత్తం 26 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 13 స్థానాలు కేటాయించారు.

ఈ 13 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు విజయం సాధించడంతో వంద శాతం స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసింది. దీంతో మండలంలో జనసేన హవా స్పష్టంగా కనిపించింది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 12 స్థానాల్లో 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఒక్క స్థానంలో ఓటమి పాలవడంతో టీడీపీ వంద శాతం విజయాల రికార్డును అందుకోలేకపోయింది. ఇక కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించిన ఏకైక ఎంపీటీసీ స్థానాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో బీజేపీ ఖాతాలో ఒక్క స్థానం కూడా చేరలేదు.

దీంతో బీజేపీకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఫలితాల నేపథ్యంలో అనకాపల్లి మండల రాజకీయాల్లో జనసేన సాధించిన విజయంపై విస్తృత చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి సీటు కేటాయించకపోయినా బాగుండేదనే అభిప్రాయాలు కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

మొత్తంగా చూస్తే.. అనకాపల్లి మండలంలో జనసేన తన సత్తా చాటగా, టీడీపీ కూడా మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే బీజేపీకి కేటాయించిన ఒక్క స్థానంలోనూ విజయం దక్కకపోవడం ఇప్పుడు కూటమిలో చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి మండలంలో జనసేన విజయ పరంపర.. బీజేపీకి మాత్రం నిరాశ! ఇదే ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI