Devarapalli: మారేపల్లిలో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి!

Devarapalli: అనకాపల్లి మారేపల్లికి చెందిన కామిరెడ్డి సూర్యనారాయణ (55) పురుగుల మందు తాగి మృతి. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 26 Oct 2026 4:29 PM IST
Devarapalli
X

Devarapalli: మారేపల్లిలో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి!

దేవరాపల్లి: అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం, మారెపల్లి గ్రామానికి చెందిన కామిరెడ్డి సూర్యనారాయణ (55 సంవత్సరాలు) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, మృతుడు మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడని, కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినప్పటికీ తన అలవాటును మార్చుకోలేదని తెలిసింది.

ఈ క్రమంలో, తేదీ 25.10.2026 రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన సూర్యనారాయణను అతని భార్య మందలించింది. అనంతరం మృతుడు అన్నం కావాలని అడగడంతో, అతని భార్య వంటగదిలోకి వెళ్లి అన్నం తీసుకొని తిరిగి వచ్చి చూడగా, సూర్యనారాయణ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని నోటి నుండి విషపదార్థం వాసన రావడంతో వెంటనే దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్య సిబ్బంది అతను విషపదార్థం సేవించినట్లు నిర్ధారించడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తేదీ 26.10.2026 ఉదయం 6.30 గంటలకు మృతి చెందాడు.

ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు తేదీ 26.10.2026 ఉదయం 8.00 గంటలకు దేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫిర్యాదు మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM